అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bike Stunts Case | కొందరు యువకులు ఇటీవల వాహనాలతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. కార్లు, వాహనాలతో వేగంగా దూసుకు వెళ్తున్నారు. ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ రోడ్లపై హంగామా చేస్తున్నారు. అంతేగాకుండా ఇతర వాహనాదారుల ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.
రీల్స్ కోసం ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను బంజారాహిల్స్ పోలీసులు (Banjara Hills Police) ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్ నం. 5లోని దేవరకొండ బస్తీకి చెందిన షాదాబ్ (19) జెప్టో సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
Bike Stunts Case | వైరల్ కావడంతో..
షాదాబ్ ఇటీవల KBR ప్రధాన రహదారి, షమీర్‌పేట ప్రధాన రహదారిపై నిర్లక్ష్యంగా బైక్ స్టంట్లు చేస్తూ, వాటిని వీడియో తీశాడు. ఈ వీడియోలను ఆ తర్వాత Instagramతో సహా వివిధ సోషల్ మీడియా (Social Media) వేదికలపై పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో, పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు ముప్పు కలిగించినందుకు గాను, షాదాబ్‌పై కేసు నమోదు చేశారు. ఈ స్టంట్ల కోసం ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బైకుపై ప్రమాదకర స్టంట్లు..
హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు బైకుపై రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు చేశాడు. కేబీఆర్ మెయిన్ రోడ్డులో రాత్రి సమయంలో స్టంట్లు చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. గుర్తించిన పోలీసులు వెంటనే సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. అలాగే బైకును స్వాధీనం చేసుకున్నారు.… pic.twitter.com/RdtKYdoy75
— Akshara Today | Telugu News (@aksharatoday) May 26, 2026
ఇది కూడా చదవండి..: Hyderabad Metro Refinancing | మెట్రోకు గుడ్ న్యూస్.. రూ.13,600 కోట్లతో రీఫైనాన్సింగ్ ఒప్పందం


