అక్షరటుడే, వెబ్డెస్క్: Travels Bus Accident | ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా (Anantapur District) గుత్తి మండలం పరిధిలోని వన్నెదొడ్డి సమీపంలో జాతీయ రహదారి 44పై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ నుండి ధర్మవరం వెళ్తున్న కేకే ట్రావెల్స్ (KK Travels) బస్సు గుత్తి సమీపంలో అదుపు తప్పి, రోడ్డు పక్కన బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ అదుపు కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో కనీసం 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. బస్సు మూడుసార్లు పల్టీలు కొట్టి, సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లిందని ప్రయాణికులు తెలిపారు.
Travels Bus Accident | ఆస్పత్రికి తరలింపు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో మొద్దం 24 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 15 మంది గాయపడగా మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి..: Pawan Kalyan Karma | ‘ఎవరు తప్పు చేసినా కర్మ వదలదు.. న్యూటన్ థర్డ్ లా వర్తిస్తుంది’: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


