అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Meeting | దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రధాని కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్లో చమురు సరఫరా సమస్యలు, పర్యవసానాలే ప్రధాన అజెండా. పశ్చిమాసియా సంక్షోభం భారంగా మారడంతో పీఎంవో కీలక భేటీ నిర్వహిస్తోంది. వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులతో 7 అధికార బృందాలను ఏర్పాటు చేసింది. చమురు ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రజలపై భారం పడకుండా ఏం చేయాలనే అంశాలపై ఈ మీటింగ్లో చర్చించనున్నట్లు సమాచారం.
PM Meeting | విపక్షాల విమర్శలు

దేశంలో ఇంధన ధరల పెంపుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. ప్రజల్లో సైతం ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. దీంతో ప్రధాని కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి..: Kacheguda Sri Ganganagar Express | ఉత్తరాది వెళ్లే వారికి శుభవార్త.. కాచిగూడ -శ్రీగంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ క్రమబద్ధీకరణ


