Samantha Fan Proposal | మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంతకు ఫ్యాన్ ప్రపోజల్.. స్టేజ్‌పై జరిగిన ఘటన వైరల్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha Fan Proposal | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగిన ఓ అనూహ్య సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్టేజ్‌పై దర్శక బృందం, నటీనటులు ఉండగా, అకస్మాత్తుగా ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకుని నేరుగా స్టేజ్‌పైకి వచ్చాడు.

Samantha Fan Proposal | భ‌ర్త ముందే ప్ర‌పోజ్..

ఆ సమయంలో స్టేజ్‌పై రాజ్ నిడిమోరు (Raj Nidimoru) మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పువ్వులు చేతిలో పట్టుకుని వచ్చిన ఆ అభిమాని సమంత ముందు మోకాళ్లపై కూర్చుని ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో కాసేపు కార్యక్రమంలో అనూహ్య వాతావరణం నెలకొంది. ఈ సంఘటనతో స్టేజ్‌పై ఉన్న యాంకర్ శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి సహా పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అభిమాని సమంతతో ఒక్క సెల్ఫీ కావాలని కోరడంతో, సమంత చిరునవ్వుతో స్పందించి అతనితో సెల్ఫీ దిగింది.

Samantha Fan Proposal | సమంత మనసు కూడా బంగారమే”

సమంత వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. “సినిమా టైటిల్ మాత్రమే కాదు.. సమంత మనసు కూడా బంగారమే” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అభిమానిని నిరాశపరచకుండా ఎంతో హుందాగా స్పందించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్‌లో ఓ వృద్ధ మహిళతో కూడా సమంత ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులతో ఆమె వ్యవహరించే విధానం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

కాగా, కొంతకాలంగా తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రలకు దూరంగా ఉన్న సమంత, ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషనల్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట మే నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ, షెడ్యూల్ మార్పులతో విడుదల తేదీని వాయిదా వేశారు. ప్రస్తుతం సినిమా  ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Ananya Panday Dance Trolls | అనన్య పాండే డ్యాన్స్​పై ట్రోల్స్..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *