Skoda Epiq EV | సింగిల్ ఛార్జ్​తో 440 కిలోమీటర్లు.. త్వరలో మార్కెట్ లోకి స్కోడా కొత్త ఈవీ కారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Skoda Epiq EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. ఇటీవల జ్యూరిచ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఎపిక్ ’ ప్రొడక్షన్ వర్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది గరిష్టంగా 440 కి.మీ. రేంజ్ ఇస్తుందని చెబుతోంది.

ఇళ్లకు పవర్ సప్లై చేసుకునే బై డైరెక్షనల్ ఛార్జింగ్ ఫీచర్ దీని ప్రత్యేకత. వచ్చే ఏడాది భారత మార్కెట్‌లోకి వచ్చే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ గ్లోబల్ మార్కెట్‌ (Global Market)లో జూలై నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో భారత్‌లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఇది టాటా నెక్సాన్ ఈవీకి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. కారు ఫీచర్లు ఇలా ఉన్నాయి.

లుక్ : పాత క్లాసిక్ స్కోడా ‘యతి’ మోడల్‌ను గుర్తుకు తెచ్చేలా బాక్సీ, అప్‌రైట్ డిజైన్ ఉన్నాయి. స్కోడా తన సరికొత్త ‘మోడరన్ సాలిడ’ డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించిన మొదటి కారిది. ముందు భాగంలో గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన టెక్ డెక్ ఫేస్, దానికి ఇరువైపులా స్లిమ్ ట షేప్డ్ ఎల్ ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి కారుకు ప్రీమియం లుక్‌ని అందిస్తున్నాయి.

Skoda Epiq EV | పొడవు 4.1 మీటర్లు..

కారు పొడవు 4,171 మి.మీ. మాత్రమే. చిన్నగా ఉండడం వల్ల నగరాల్లో ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. చిన్న కారే కదా అని తక్కువ అంచనా వేయొద్దు. లోపల స్పేస్ మాత్రం ఇరుకుగా ఏమీ ఉండదు. ఏకంగా 475 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. లగేజ్ ఎక్కువగా తీసుకెళ్లే మధ్య తరగతి కుటుంబాలకు ఇది సరిపోతుంది.

Skoda Epiq EV | బ్యాటరీ ఆప్షన్లు..

స్కోడా ఎపిక్ కొత్త ఎంఈబీ ప్లస్ ప్లాట్‌ఫాంపై తయారయ్యింది. ఇది రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది.
బేస్ మోడల్‌లో 38.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 310 కిమీ రేంజ్ ఇస్తుంది.
లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఇది సింగిల్ చార్జ్‌తో 440 కి.మీ.ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. డీసీ ఫాస్ట్ చార్జర్ సహాయంతో 24 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం చార్జ్ అవుతుందని పేర్కొంటోంది.
ఈ టాప్ ఎండ్ మోడల్ 208 బీహెచ్‌పీ పవర్‌ను, 290 ఎన్ ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీటర్లు.

Skoda Epiq EV | ఇన్వర్టర్‌లా..

ఈ కొత్త కారులో ఉన్న వినూత్నమైన ఫీచర్ ‘బై డైరెక్షనల్ చార్జింగ్ ’. అంటే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఈ కారు బ్యాటరీ నుంచి ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు లేదా ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను ఆన్ చేసుకోవచ్చన్న మాట.

ధర : స్కోడా ఎపిక్ ఈవీ ధర యూకే మార్కెట్‌లో సుమారు 27,700 యూరోలుగా ఉంది. భారతదేశంలో రూ. 20 లక్షలనుంచి రూ. 25 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Stock Market india | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *