అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vijay Krishna| బీజేవైఎం (యువమోర్చా) (BJYM Telangana) రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ జిల్లాకు(Nizamabad BJP) చెందిన సీనియర్ నాయకుడు అమంద్ విజయ్ కృష్ణకు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Vijay Krishna | అంకితభావంతో
గత 15 ఏళ్లుగా పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తూ.. డివిజన్ కార్యదర్శి స్థాయి నుండి రాష్ట్ర కోశాధికారిగా ఎదిగిన విజయ్ కృష్ణ నియామకం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (Mla Dhanpal), జిల్లా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో యువమోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..


