నిజామాబాద్Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక అని డీఈవో అశోక్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల్​భవన్​లో మంగళవారం వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక అని డీఈవో అశోక్ (Deo Ashok)​ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల్​భవన్​లో మంగళవారం వేసవి శిక్షణ తరగతుల్లో (summer training) భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Bal Bhavan | ప్రతిభను వెలికితీసే వేదిక..

డీఈవో మాట్లాడుతూ.. చిన్నారుల్లో అపారమైన ప్రతిభ ఉంటుందని.. దానిని వెలికితీసేందుకు సరైన వేదికలు అవసరమన్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా వివిధ రకాల ప్రదర్శనలకు బాల్​భవన్ చక్కటి వేదికగా మారిందన్నారు. చిన్నారులు ఆయా ప్రదర్శనల్లో చూపిస్తున్న ప్రతిభ చూస్తే ముచ్చటేస్తుందన్నారు. అలాగే బాల్​భవన్​ ఫౌండర్​ నారాయణ సింహాచలం వారసులు మామిడిపూడి ప్రేమలత హాజరై మాట్లాడుతూ.. చిన్నారులు ప్రతిభ అద్భుతమన్నారు.

బాల్​భవన్​ సూపరింటెండెంట్​ మల్లాది ఉమాబాల మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా(Nizamabad) 750 మంది చిన్నారులకు వేసవి సెలవుల్లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన పదిమంది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి, సర్టిఫికెట్లను డీఈవో అందజేశారు. చిన్నారులు వేసిన జడకొప్పులాట, యోగా ప్రదర్శన, బాంగ్రా నృత్యం, శ్లోకాలు, కర్రసాము అహుతులను అలరించాయి. ఈ ​కార్యక్రమంలో పూర్వ బాల్​భవన్​ సూపరింటెండెంట్​ విఠల్​, ప్రభాకర్​, పుష్పలత, వెంకటలక్ష్మి, నటరాజ్​, శ్వేత, సోనాలి, రిచా, మాధవి, నవీన్​, రాంచందర్​, గణేష్​, మాధవి, విజయ తదితరులు పాల్గొన్నారు.

dance

ఇది కూడా చదవండి: Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Panchayat Staff Salaries | పంచాయతీ సిబ్బందికి తీపి కబురు.. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Panchayat Staff Salaries | రాష్ట్రంలోని 50 వేల...

KVIC Khadi Growth | ఖద్దరుకు ‘మహా’ వైభవం.. ₹1.87 లక్షల కోట్లకు చేరిన ఖాదీ టర్నోవర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KVIC Khadi Growth | భారతీయ సంస్కృతికి, స్వదేశీ...

Karnataka Congress Reset | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘పవర్ రీసెట్’.. సిద్ధరామయ్యకు స్థానచలనం.. శివకుమార్‌కు పట్టాభిషేకం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Congress Reset | దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా...

Heavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Havoc | తెలుగు రాష్ట్రాలను...