Youth Congress Strengthening | యువతను పార్టీతో అనుసంధానం చేయాలి

యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్​ను బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి ఖలీద్ అహ్మద్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Strengthening | యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్​ను (Youth Congress ) బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి ఖలీద్ అహ్మద్ సూచించారు. శుక్రవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలో నిర్వహించిన జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Youth Congress Strengthening | సంస్థాగత బలోపేతానికి..

జిల్లాలో యువజన కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, ఐవైసీ యాప్​లో గ్రామ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఐవైసీ యాప్ ద్వారా గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్దార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ChatGPT for Teens | ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం. టీనేజర్ల కోసం అద్భుత ఫీచర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *