అంతర్జాతీయంNeurosurgeon Suspension | రోగితో అనైతిక సంబంధం.. సీనియర్ న్యూరోసర్జన్‌పై చర్యలు, 8 నెలల సస్పెన్షన్

Neurosurgeon Suspension | రోగితో అనైతిక సంబంధం.. సీనియర్ న్యూరోసర్జన్‌పై చర్యలు, 8 నెలల సస్పెన్షన్

బ్రిటన్‌లో ఓ సీనియర్ న్యూరోసర్జన్ రోగితో అనైతిక సంబంధం కొనసాగించిన ఘటన సంచలనం రేపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Neurosurgeon Suspension | వైద్య వృత్తిని అత్యంత బాధ్యతాయుతమైన సేవగా భావించే సమాజంలో, ఒక సీనియర్ న్యూరోసర్జన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగి నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ వృత్తి నైతిక విలువలను అతిక్రమించిన ఘటన బ్రిటన్‌ (Britain)లో వెలుగులోకి వచ్చింది.

రోగితో అనైతిక సంబంధం కొనసాగించడమే కాకుండా, వైద్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తాజా వివరాల ప్రకారం, చిరాగ్ ప‌టేల్ అనే సీనియర్ న్యూరోసర్జన్ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్ ఆఫ్ వేల్స్లో విధులు నిర్వహిస్తున్నారు. వెన్నెముక సమస్యతో చికిత్స కోసం వచ్చిన ఒక మహిళతో ఆయన వ్యక్తిగత సాన్నిహిత్యం పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

Neurosurgeon Suspension | విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డింది..

సమాచారం ప్రకారం, 2019లో బాధితురాలికి శస్త్రచికిత్స చేసిన సమయంలో ప్రారంభమైన పరిచయం తరువాతి కాలంలో వ్యక్తిగత సంబంధంగా మారినట్లు తెలుస్తోంది. ఈ సంబంధం 2023 వరకు కొనసాగినట్లు విచారణలో ప్రస్తావనకు వచ్చింది. అంతేకాకుండా, వైద్య నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు వ్యసనపరమైన మందులు సూచించడం, వ్యక్తిగత పరిమితులను దాటే విధంగా ప్రవర్తించడం వంటి అంశాలు కూడా కేసులో ప్రస్తావించబడ్డాయి. తరువాత వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.

Neurosurgeon Suspension | సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

విచారణ సందర్భంగా డాక్టర్ చిరాగ్ పటేల్ తన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విచారణ కమిటీ ఆయన వాదనలను సమర్థించలేదు. కేసును పరిశీలించిన మెడికల్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యుడిగా రోగి భద్రత, విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించారని పేర్కొంది. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వృత్తి ధర్మాన్ని ఉల్లంఘించడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో డాక్టర్ చిరాగ్ పటేల్‌ను ఎనిమిది నెలల పాటు వైద్య సేవల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన వైద్య వృత్తిలో నైతిక ప్రమాణాల ప్రాధాన్యతపై మరోసారి చర్చకు దారితీస్తోంది.

ఇది కూడా చదవండి..: Thailand Drug Dealer Arrest | లేడీ డ్యాన్సర్ల వేషంలో.. డ్రగ్స్​ డాన్​ను పట్టుకున్న పోలీసులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...