అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka CM Change | కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆ రాష్ట్రానికి త్వరలో కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పుపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. అధిష్టానం సిద్ధరామయ్యను సీఎం సీట్లో కూర్చొబెట్టింది. అయితే ఆ సమయంలో పవర్ షేరింగ్ విధానంలో ఆయనకు సీఎం సీటు ఇచ్చారని, రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారని ఆయన వర్గం వారు పేర్కొన్నారు. ఈ మేరకు సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు అయన నాటి నుంచి డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా సిద్ధరామయ్య 2023 మే 20 ప్రమాణం చేశారు. దీంతో మూడేళ్లు అయిపోతుంది. ఈ క్రమంలో డీకే వర్గం ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం సీఎంను మార్చనున్నట్లు సమాచారం.
Karnataka CM Change | సుదీర్ఘ చర్చల అనంతరం
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్య నేతలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 6 గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. అయితే సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సీఎం మార్పు లేదని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. కానీ తాజాగా కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు సీఎం మార్పు ఉంటుందని పేర్కొంటున్నాయి. గురువారం ఉదయ సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని, ఈ నెల 30న కొత్త సీఎం ప్రమాణం చేస్తారని సమాచారం.
Karnataka CM Change | గవర్నర్‌ను కలవనున్న సీఎం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం 11 గంటలకు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన రేపు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో అపాయింట్‌మెంట్ కూడా కోరారు. ఇది రాష్ట్రంలో తక్షణ నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా విస్తృతంగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు.
Karnataka CM Change | వారి మధ్య పోటీ
కొత్త సీఎం రేసులో డీకే శివకుమార్ ఉన్నారు. ఆయనతో పాటు పరమేశ్వరన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని ఆయన వర్గం వారు భావిస్తున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం డీకే శివకుమార్ తీవ్రంగా కృషి చేశారు.
Karnataka CM Change | బీజేపీ విమర్శలు
బీజేపీ నాయకుడు బసవరాజ్ బొమ్మై బుధవారం మాట్లాడుతూ, సిద్ధరామయ్య కాంప్రమైజ్ అయ్యారని విమర్శింఆరు. సిద్ధరామయ్య రాజీపడ్డారు. ఆయన తంత్రాలతో పైకి వచ్చారు అని బొమ్మై అన్నారు.సిద్దరామయ్యను తొలగించడం ఓబీసీ వర్గాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, ఇది కాంగ్రెస్, ఇండియా కూటమికి రాజకీయంగా నష్టం కలిగించగలదని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి..: Supreme Court SIR Verdict | విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఎస్ఐఆర్ను సమర్థించిన సుప్రీంకోర్టు


