DMK INDIA Alliance | ఇండియా కూటమి సమావేశానికి వెళ్లం.. డీఎంకే కీలక ప్రకటన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DMK INDIA Alliance | ఇండియా కూటమి సమావేశానికి వెళ్లబోమని డీఎంకే (DMK) పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్​ కారణంగానే తాము ఈ మీటింగ్​కు​ హాజరు కావడం లేదని తెలిపింది.

ఢిల్లీ (Delhi)లో జూన్ 8న జాతీయ ఇండియా కూటమి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్​లో కాంగ్రెస్​ పాల్గొంటుంది కాబట్టి ద్రవిడ మున్నేట్ర కజగం అందులో పాల్గొనదు! అదే సమయంలో ఈ సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు లేవనెత్తే, దేశ సంక్షేమానికి భంగం కలిగించే ఏవైనా అంశాలపై ద్రవిడ మున్నేట్ర కజగం ఎల్లప్పుడూ తన గళం వినిపిస్తుంది అని ఎక్స్​లో పోస్టు చేసింది.

DMK INDIA Alliance | అసెంబ్లీ ఎన్నికల తర్వాత

rahul

తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయ్​ నేతృత్వంలోని టీవీకే (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. డీఎంకే కూటమి రెండో స్థానంలో నిలిచింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్​ ఐదు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. అయితే ఫలితాల అనంతరం ఆ పార్టీ ప్లేట్​ ఫిరాయించింది. డీఎంకేను కాదని టీవీకేకు సపోర్ట్ చేసింది. TVKతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న వెంటనే, ఆ పార్టీతో తమ సంబంధాలను తెంచుకుంటున్నట్లు DMK ఇప్పటికే ప్రకటించింది.

DMK INDIA Alliance | కీలక సమావేశం

తమిళనాడుతో సహా నాలుగు రాష్ట్రాల్లోనూ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కలిసి మొత్తం 234 ఎంపీ స్థానాలను కలిగి ఉన్నాయి. కాంగ్రెస్ (99), సమాజ్‌వాదీ పార్టీ (37), తృణమూల్ కాంగ్రెస్ (29) తర్వాత ఈ కూటమిలో నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా డీఎంకే (22) నిలిచింది. అయితే ప్రస్తుతం డీఎంకే బయటకు రావడంతో కూటమి బలహీనంగా మారింది. ఇప్పటికే కేజ్రీవాల్ బయటకు వచ్చారు. మరోవైపు మమత బెనర్జీ సైతం మొన్నటి వరకు అంటిముట్టనట్లుగానే వ్యవహరించారు. అయితే ఇటీవల బెంగాల్​ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. దీంతో సమావేశానికి హాజరు అవుతారా లేదా అనేది చూడాలి.

dmk

దీనిని కూడా చదవండి : Lalit Modi | సోనియా గాంధీపై లలిత్​ మోదీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *