అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court Judges | సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో భాగంగా.. ఐదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా కొలీజియం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కొలీజియం సిఫార్సు చేసిన వారిలో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు (చీఫ్ జస్టిస్) కాగా, ఒకరు సీనియర్ న్యాయవాది కావడం గమనార్హం.
Supreme Court Judges | కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురి వివరాలు
- జస్టిస్ శీల్ నాగు: పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- జస్టిస్ చంద్రశేఖర్: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- స్టిస్ సంజీవ్ సచ్‌దేవా: మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- జస్టిస్ అరుణ్ పల్లి: జమ్మూ కాశ్మీర్ – లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- వి. మోహన: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
Supreme Court Judges | బార్ అసోసియేషన్ నుంచి ఒకరికి అవకాశం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు, నేరుగా బార్ (న్యాయవాదుల) నుంచి సీనియర్ మహిళా న్యాయవాది వి. మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించడం విశేషం.
ఈ ఐదుగురి పేర్లను కొలీజియం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాత వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్…..


