తెలంగాణRevanth vs KCR | ఒకే గడ్డ.. ఇద్దరు అగ్రనేతలు.. కరీంనగర్‌లో హీటెక్కిన పొలిటికల్ వార్!

Revanth vs KCR | ఒకే గడ్డ.. ఇద్దరు అగ్రనేతలు.. కరీంనగర్‌లో హీటెక్కిన పొలిటికల్ వార్!

సుదీర్ఘ విరామం తర్వాత ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్, తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సాగునీరు , తాగునీటి ఎద్దడిని ప్రస్తావిస్తూ, గత పదేళ్ల అభివృద్ధిని ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Revanth vs KCR | తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటాపోటీ సభలతో తమ రాజకీయ బలాబలాలను ప్రదర్శించారు. ఒకవైపు జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మార్కు విమర్శలతో ప్రభుత్వంపై విరుచుకుపడగా.. దానికి కొద్ది దూరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “కాస్కో కేసీఆర్” అంటూ సవాల్ విసరడం రాష్ట్రంలో రాజకీయ వేడిని పతాక స్థాయికి చేర్చింది.

Revanth vs KCR | జగిత్యాల సభ వ్యూహాలు..

సుదీర్ఘ విరామం తర్వాత ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్, తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సాగునీరు, తాగునీటి ఎద్దడిని ప్రస్తావిస్తూ, గత పదేళ్ల అభివృద్ధిని ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు. ముఖ్యంగా మేడిగడ్డ వంటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.akshara today .jpgjeevan

Revanth vs KCR | జీవన్ రెడ్డికి ‘గులాబీ’ గౌరవం..

నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరడం ఈ సభలో హైలైట్‌గా నిలిచింది. ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కేసీఆర్ వేదికపైనే ప్రకటించారు. “కాంగ్రెస్‌లో విధేయులకు గుర్తింపు లేదు, ఆత్మాభిమానం కోసమే ఈ నిర్ణయం” అని జీవన్ రెడ్డి పేర్కొనగా, ఆయన అనుభవం పార్టీకి కొండంత అండ అని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Revanth vs KCR | ప్రాజెక్టుల యుద్ధం..

అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘మేడిగడ్డ’ బ్యారేజ్​ను సందర్శించి అక్కడి నుంచే కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ అవినీతి, నాణ్యత లోపం వల్లే ప్రాజెక్టులు కుంగిపోయాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ పోరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రేవంత్ సవాల్..

జగిత్యాల వేదికగా కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “కాస్కో కేసీఆర్.. 2029 నాటికి నీ పార్టీ ఉనికే లేకుండా చేస్తా” అంటూ ఆయన విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల ద్వారా ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తుండగా.. సీనియర్ నేతల చేరికతో కేసీఆర్ మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారు. ఈ పోటీ సభలు తెలంగాణలో రాబోయే రాజకీయ యుద్ధానికి స్పష్టమైన నాంది పలికాయి.

Tim Cook Resignation | యాపిల్​ సీఈవో టిమ్ కుక్ తన బాధ్యతలకు గుడ్​బై.. కొత్త సారథిగా జాన్​ టెర్నస్​!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...