Dubai Missing | దుబాయ్​లో భర్త అదృశ్యం.. కన్నీటి పర్యంతమవుతున్న భార్యాపిల్లలు

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Dubai Missing | ఉపాధి కోసం దుబాయ్ (Dubai)​ వెళ్లిన భర్త అదృశ్యం కావడంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మెండోరా (Mendora) మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ దుబాయ్ వెళ్లిన అనంతరం ఆచూకీ లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Dubai Missing | ఫోన్​ స్విచ్​ ఆఫ్​

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీకాంత్ ఈనెల 15వ తేదీన మరో తొమ్మిది మందితో కలిసి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. వెళ్లిన మరుసటి రోజు ఫోన్‌లో మాట్లాడిన శ్రీకాంత్​ మరుసటి రోజు నుంచి పనికి వెళ్తానని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిన మిగతా వ్యక్తులు పనికి వెళ్తున్నారని సంబంధిత ఏజెంట్ రమేష్ తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అయితే గత 13 రోజులుగా శ్రీకాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆయన ఆచూకీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భార్య అలేఖ్య తెలిపింది. తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని.. తన భర్త ఎక్కడ ఉన్నాడో గుర్తించి సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యింది.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *