అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rapthadu Attack Case | అనంతపురం జిల్లా (Anantapur District) రాప్తాడులో పదో తరగతి విద్యార్థిపై దాడి చేసిన నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం ఉంది. అతడిపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అనంతపురం ఆస్పత్రిలో నిందితుడు చికిత్స పొందుతున్నాడు.
రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నిందితుడు హేమంత్ శనివారం చెట్లు కోసే రంపంతో దాడి చేసిన విషయం తెలిసిందే. పాఠశాల గదిలోకి చొరబడిన హేమంత్, తనతో తెచ్చుకున్న ఎలక్ట్రిక్ రంపంతో దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాలిక ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతోంది. ఈ కేసులో నిందితుడు హేమంత్పై ఆదివారం రాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. పట్టుకోవడానికి యత్నించిన పోలీసులపై దాడి చేయడంతో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. నిందితుడి మోకాళ్ల కింది భాగంలో ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
Rapthadu Attack Case | కొనసాగుతున్న చికిత్స
హేమంత్‌కు అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఒక కాలులోని బుల్లెట్లను తొలగించారు. కుడి కాలులో ఇంకా 3 బుల్లెట్లు ఉన్నాయి.
కాసేపట్లో డాక్టర్లు ఆపరేషన్ చేయనున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఇప్పటికే 4 యూనిట్ల రక్తం ఎక్కించారు. అతడి కాళ్లను మోకాళ్ల కింది వరకు తొలగించే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి..: Murasu Cyclone | తుపాన్ ఎఫెక్ట్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన