Pacemaker Treatment | పేస్‌మేకర్‌తో గుండె వేగాన్ని పరిమితంగా ఉంచవచ్చు..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Pacemaker Treatment | గుండె లయ తప్పిన వారికి ‘పేస్‌మేకర్’ (pacemaker) ఒక వరం లాంటిదని యశోద ఆస్పత్రి (Yashoda Hospital) కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎంఎస్ ఆదిత్య తెలిపారు. కామారెడ్డి యశోద బ్రాంచ్ క్లినిక్​లో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

Pacemaker Treatment | హార్ట్​ బ్లాక్​.. సిక్​ సైనస్​ సిండ్రోమ్​..

గుండెచాలా నెమ్మదిగా కొట్టుకోవడం, హార్ట్ బ్లాక్, సిక్ సైనస్ సిండ్రోమ్ (Sick Sinus Syndrome) వంటి సమస్యలతో బాధపడే వారికి పేస్‌మేకర్ అమర్చడం ద్వారా సాధారణ జీవితం గడిపే అవకాశం ఉందని డాక్టర్​ ఆదిత్య వివరించారు. ఇటీవల కార్డియాలజీ సమస్యలకు అనేక రకాల పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని తెలిపారు. యశోద ఆస్పత్రిలో 12 మంది కార్డియాలజీ వైద్యులు ఉన్నారని, ఏ సమయంలో అయినా వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. వయసు ఎక్కువ అవుతుండటంతో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. యశోద ఆస్పత్రిలో ఆయాదునిక అల్ట్రా సౌండ్ మోడల్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

Pacemaker Treatment | నిమిషానికి 60 కంటే తక్కువ సార్లు కొట్టుకుంటే..

గుండె వేగం నిమిషానికి 60 కంటే తక్కువ సార్లు కొట్టుకునే బ్రాడీకార్డియా సమస్య ఉన్నవారిలో కళ్లు తిరగడం, అలసట, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్​ పేర్కొన్నారు. పేస్‌మేకర్ అవసరమైనప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపి గుండెను నార్మల్ స్పీడ్‌లో కొట్టుకునేలా చేస్తుందని తెలిపారు. దీనివల్ల రోగి ఆయాసం లేకుండా నడవగలరని, రోజువారీ పనులు చేసుకోగలరని వివరించారు. అంతేకాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కొందరికి సీఆర్​టీ పేస్‌మేకర్ అమర్చడం ద్వారా గుండె రెండు గదులు ఒకేసారి కాంట్రాక్ట్ అయ్యేలా చేసి, పంపింగ్ సామర్థ్యం పెంచవచ్చని చెప్పారు. దీనివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ రిస్క్ కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు. సమావేశంలో కామారెడ్డి (Kamareddy) యశోద బ్రాంచ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Samagra Sanksema Card | ప్రతి ఒక్కరికి ‘సమగ్ర సంక్షేమ కార్డు’ : సీఎం రేవంత్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *