అక్షరటుడే, వెబ్‌డెస్క్: NMMS App Issues | వేసవి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నిత్యం ఉదయాన్నే కూలీలు పనులకు వెళ్తున్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ విధానం తీసుకొచ్చింది.
ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు ఉదయం వెళ్లగానే యాప్లో ఫొటోదిగాలి. అనంతరం పనులు ముగించుకొని ఇళ్లకు వచ్చే సమయంలో మళ్లీ ఫొటో దిగాలి. అయితే కూలీలను యాప్ గుర్తించడం లేదు. దీంతో ఉపాధి హామీ సిబ్బందితో పాటు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
NMMS App Issues | మహబూబ్నగర్లో..
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో ఒక కూలీ గుడిలో తలనీలాలు సమర్పించుకున్నాడు. ఇనుగుర్తి మండలం (Inugurthi Mandal) కోమటిపల్లి గ్రామంలో మల్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల కొండగట్టులో గుండు చేయించుకున్నాడు. గుండుతోనే వంద రోజుల పనికి వెళ్లాడు. అయితే ఫేస్ యాప్ లో హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నించగా అతన్ని గుర్తించలేదు. ఎన్ని సార్లు ఫొటో తీసినా అటెండెన్స్ నమోదు కాలేదు.
NMMS App Issues | యాప్లో సాంకేతిక లోపాలు
దీంతో మరో మహిళ కూలీ వినూత్నంగా ఆలోచించింది. ముఖ ధృవీకరణ (face verification) సమయంలో, అతనితో పనిచేసే ఒక మహిళా తన జుట్టుతో అతని గుండును కప్పి ఉంచిన తర్వాతే, ఆ యాప్అతన్ని గుర్తించింది.యాప్లో సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యల కారణంగా తమ వేతనాలు చెల్లింపు ఇప్పటికే ఆలస్యమవుతోందని కార్మికులు వాపోతున్నారు. ఈ విచిత్రమైన జుట్టు ఉపాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tech Fail! In the Mahabubabad dist, a labourer’s face was not recognised by the NMMS attendance app after he tonsured his head at a temple. Reportedly attendance worked only after he used a woman labourer’s hair cover for face authentication. Workers say app errors and network… pic.twitter.com/KacfPciAR0
— Ashish (@KP_Aashish) May 29, 2026
ఇది కూడా చదవండి..: Mahalakshmi Card | ‘మహాలక్ష్మి’ కార్డుంటేనే బస్సులో ఫ్రీ.. జూన్ 2నుంచి పంపిణీ చేసే అవకాశం!


