Siddaramaiah Resignation | రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడి మంత్రి పదవిపైనే చర్చ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Siddaramaiah Meet Rahul Gandhi | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గురువారం రాత్రే దిల్లీ చేరుకున్న ఆయన.. శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో (Rahul Gandhi)  భేటీ అయ్యారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, తదుపరి మంత్రివర్గ కూర్పుపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు హైకమాండ్ ముందు పలు కీలక డిమాండ్లను ఉంచినట్లు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Siddaramaiah Meet Rahul Gandhi | కుమారుడికి కీలక శాఖ కోసం పట్టు..

ఈ సమావేశానికి సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రను కూడా వెంటబెట్టుకుని వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త క్యాబినెట్‌లో తన కుమారుడికి కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించాలని ఆయన రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. యతీంద్రకు వైద్య విద్య లేదా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇవ్వాలని.. లేనిపక్షంలో గతంలో డీకే శివకుమార్‌ నిర్వహించిన ఇరిగేషన్ (జలవనరులు), పరిశ్రమల శాఖల్లో ఒకదానిని కేటాయించాలని సిద్ధూ గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

rahul 2

Siddaramaiah Meet Rahul Gandhi | కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతానని..

దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో సిద్ధరామయ్య తన సొంత రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. తనకు రాజ్యసభకు వెళ్లడంపై ఎలాంటి ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే క్రియాశీలకంగా కొనసాగుతానని ఆయన హైకమాండ్‌కు తేల్చి చెప్పారు. దీనితో పాటు రాబోయే కొత్త క్యాబినెట్‌లో ఉపముఖ్యమంత్రి పదవిని తన వర్గానికి చెందిన నేతకే ఇవ్వాలని కోరారు. తన అనుచరులకు, విధేయులకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ పలువురు నేతల జాబితాను కూడా రాహుల్‌ గాంధీకి అందజేశారు.

Siddaramaiah Meet Rahul Gandhi

రాహుల్ గాంధీతో చర్చలు ముగిసిన వెంటనే, సిద్ధరామయ్య కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున్‌ ఖర్గేను కూడా కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

ఇది కూబా చదవండి: El Nino Effect | ఎల్​నినో ఎఫెక్ట్​.. ఈ ఏడాది తక్కువ వర్షాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *