LIC Bonus Issue | ఎల్ఐసీ షేరు ధర ఢమాల్.. ఒక్కరోజులో 50 శాతం తగ్గిన విలువ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: LIC Bonus Issue | దేశీయ బీమా రంగ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు మే 29 భారీగా పతనమయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange)లో క్రితం ముగింపు ధర రూ. 830 ఉండగా.. శుక్రవారం ప్రారంభంలో 413కి పడిపోయింది. అంటే 50.2 శాతం తగ్గింది.

LIC Bonus Issue | ఎందుకిలా జరిగిందంటే..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) 1:1 లో బోనస్ ఇష్యూ చేసింది. దీంతో ఆ మేరకు స్టాక్ ధరలో సర్దుబాటు జరిగింది. మే 29 ఎక్స్ బోనస్ తేదీ. ఈ కారణంగానే స్టాక్ ధర 50 శాతం పతనమైనట్లు ఇన్వెస్టర్ల పోర్ట్‌పోలియోలో కనిపిస్తోంది. అయితే ఇది నిజమైన నష్టం కాదు. 1:1 బోనస్ ఇష్యూ అంటే.. ఇన్వెస్టర్ వద్ద ఉన్న ప్రతి షేరుకు అదనంగా కంపెనీ మరొక షేరును ఉచితంగా ఇస్తుంది. దీనివల్ల షేర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది.

LIC Bonus Issue | ఓఎఫ్ఎస్ పై దృష్టి..

భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థలో ప్రభుత్వం వాటా విక్రయానికి మార్గం సుగమం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే బోనస్ ఇచ్చారు. షేర్ల సంఖ్యను రెట్టింపు చేయడం వల్ల భారీ లావాదేవీలతో మార్కెట్‌ను ముంచెత్తకుండా, భవిష్యత్తులో ఆఫర్ ఫర్ సేల్ ను అమలు చేయడం ప్రభుత్వానికి సులభతరం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎల్ఐసీలో 2 శాతం వాటాను అంటే రూ. 10 వేల కోట్ల వరకు ప్రణాళికాబద్ధమైన షేర్ల అమ్మకం కోసం ప్రభుత్వం వచ్చే నెలలో ఓఎఫ్ఎస్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

LIC Bonus Issue | ఐపీవో ఇన్వెస్టర్లకు నష్టాలే..

ఎల్ఐసీ స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో లిస్టయినప్పటినుంచి ఓ మోస్తరు పనితీరునే కనబరుస్తోంది. దీంతో స్టాక్ ధర ఆటుపోటులకు గురవుతోంది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసి లాభాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇప్పటికీ నిరాశనే మిగిల్చింది. ఒక్కో షేరుకు రూ. 945 గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద పబ్లిక్ ఇష్యూకు రాగా.. ఇప్పటికీ ఐపీవో ఇన్వెస్టర్లు 13 శాతానికిపైగా నష్టాల్లో ఉన్నారు.

LIC Bonus Issue | తొలిసారి అద్భుతమైన పనితీరు..

LIC Bonus Issue

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన తర్వాత తొలిసారి అత్యంత బలమైన త్రైమాసిక పనితీరును నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండఅలోన్ నికర లాభం గతేడాదితో పోలిస్తే (ఇయర్ ఆన్ ఇయర్) 23.2 శాతం పెరిగి రూ. 23,420 కోట్లకు చేరింది. ఎఫ్ వై 26 పూర్తి సంవత్సరానికి పన్ను తర్వాత లాభం 19.25 శాతం వృద్ధితో రూ. 57,419 కోట్లకు పెరిగింది.

ఇది కూడా చదవండి..: Siddaramaiah Resignation | రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడి మంత్రి పదవిపైనే చర్చ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *