Stock Market Crash | చివరలో సెల్లాఫ్.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Stock Market Crash | అమెరికా -ఇరాన్ ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు చాలాసేపు స్వల్ప రేంజ్‌లో లాభనష్టాల మధ్య కదలాడాయి. అయితే ట్రేడింగ్ ముగింపు దశలో ఒక్కసారిగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

పశ్చిమాసియాలో శాంతి విషయంలో అనిశ్చితితోపాటు ఈసారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన సైతం మార్కెట్లలో పతనానికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

Stock Market Crash | ఫ్లాట్ గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 171 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని 403 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ప్రారంభమె మరో 31 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 131 పాయింట్లు పెరిగింది. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,631 పాయింట్లు, నిఫ్టీ 518 పాయింట్లు నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్ 1,092 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద, నిఫ్టీ 359 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | ఐటీ, టెలికాం మినహా..

నిఫ్టీ (Nifty)లో ఐటీ, టెలికాం ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్నిరంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.60 శాతం, టెలికాం 0.40 శాతం లాభపడగా.. ఆయిల్ అండ్ గ్యాస్ 2.47 శాతం, యుటిలిటీ 2.23 శాతం, ఎనర్జీ 2.08 శాతం, మెటల్ 2.02 శాతం, ఆటో 1.96 శాతం, ఎఫ్ ఎంసీజీ 1.51 శాతం, ఫార్మా 1.50 శాతం నష్టపోయాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

stock market crash

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,670 కంపెనీలు లాభపడగా 2,599 స్టాక్స్ నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 185 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 75 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్ల మేర క్షీణించింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్ లాభపడగా.. 26 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 1.96 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.65 శాతం, ఎల్టీ 1.07 శాతం, ఇన్ఫోసిస్ 0.05 శాతం లాభపడ్డాయి.

Stock Market Crash

Top Losers : పవర్‌గ్రిడ్ 3.46 శాతం, ఇండిగో 3.27 శాతం, ఎన్టీపీసీ 2.86 శాతం, ఎంఅండ్ఎం 2.72 శాతం, టాటాస్టీల్ 2.72 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Anthropic Valuation | ట్రిలియన్ డాలర్ల క్లబ్ లో ఆంథ్రోపిక్..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *