Stock Market Rally | గ్లోబల్ మార్కెట్లలో సెల్లాఫ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

గ్లోబల్ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నా.. మన మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో ముగిశాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Rally | ఏఐ ట్రేడ్‌లో తిరోగమనంతో గ్లోబల్ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ భారీ నష్టాలతో ముగియగా.. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

రోజంతా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మన మార్కెట్లు మాత్రం ఐటీ, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ నష్టాలను పూడ్చుకుని భారీ లాభాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic stock market)లోకి నిరంతరాయంగా సాగుతున్న విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడి చమురు ధరలు దిగిరావడం, రూపాయి విలువ బలపడుతుండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలిచారు.

Stock Market Rally | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 154 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 1,628 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 146 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మరో 23 పాయింట్లు తగ్గింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ 463 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 898 పాయింట్ల లాభంతో 83,919 వద్ద, నిఫ్టీ 286 పాయింట్ల లాభంతో 25,800 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,804 కంపెనీలు లాభపడగా 2,575 స్టాక్స్ నష్టపోయాయి. 243 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 118 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 145 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. కొటక్ బ్యాంక్ 3.08 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.02 శాతం, మారుతి 2.88 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.75 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.47 శాతం లాభపడ్డాయి.

Top Losers : టైటాన్ 1.71 శాతం, టాటా స్టీల్ 1.69 శాతం, ఎన్టీపీసీ 1.29 శాతం, హెచ్యూఎల్ 0.96 శాతం, సన్‌ఫార్మా 0.94 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Nov 20 Market Analysis | డీప్ రెడ్​లో గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *