ISI Terror Modul | ఢిల్లీ పోలీసుల భారీ ఆపరేషన్.. దావూద్, ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌కు చెందిన తొమ్మిది మంది అరెస్ట్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ISI Terror Modul | దేశ రాజధాని దిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబయి నగరాల్లో భారీ ఎత్తున వినాశనం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన వినాశకర వ్యూహాన్ని దిల్లీ పోలీసులు( Delhi Police)  విజయవంతంగా తిప్పికొట్టారు. దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించిన తొమ్మిది మంది ముఠాను శనివారం నాడు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఈ భారీ ఉగ్ర ముఠా నెట్‌వర్క్‌ను ముందే పసిగట్టి వారి ఆట కట్టించాయి.

davudh.1

ISI Terror Modul | పాక్ ఐఎస్‌ఐ, దావూద్ ఇబ్రహీంతో  లింకులు..

అరెస్టయిన నిందితులకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ (ISI) తో పాటు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో దిల్లీ, ముంబయి, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన స్థానికులతో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు దిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. భారతదేశంలో పెద్ద ఎత్తున దాడులు చేసి అశాంతిని సృష్టించేలా ఈ ఉగ్ర మాడ్యూల్‌కు పాక్ ఐఎస్‌ఐ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

davudh.2

ISI Terror Modul | భద్రతా సిబ్బందే లక్ష్యంగా స్కెచ్..

దేశంలోని అత్యంత కీలకమైన ప్రభుత్వ భవనాలు, వ్యూహాత్మక ప్రాంతాలు , భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనేది ఈ ముఠాకు అప్పగించిన ప్రధాన బాధ్యతగా పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో వారి రహస్య స్థావరాల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, వినాశకర సామాగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సూత్రధారుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:  Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *