IPL Final | ఐపీఎల్​ ఫైనల్​.. కష్టాల్లో గుజరాత్

Srinivas Kolluri
IPL Final

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Final | రెండు నెలలుగా అభిమానులకు ఉత్సాహాన్ని అందిస్తున్న ఐపీఎల్​ నేటితో ముగియనుంది. గుజరాత్​ టైటాన్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య ఫైనల్​ పోరు సాగుతోంది.

గుజరాత్​లోని అహ్మదాబాద్​ వేదికగా సాగుతున్న తుది సమరంలో జీటీ కష్టాల్లో ఉంది. టాస్​ గెలిచిన బెంగళూరు బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన గుజరాత్​ ఆది నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ జట్టు ఓపెనర్​, కెప్టెన్​ శుభ్​మన్​ గిల్​ (10) 22 పరుగుల వద్ద ఔట్​ అయ్యాడు. మరో ఓపెనర్​ సాయి సుదర్శన్ (12) సైతం వెంటనే వికెట్​ సమర్పించుకున్నాడు. దీంతో గుజరాత్​ బ్యాటర్లు ఒత్తిడిలో పడ్డారు.

ipl 1

IPL Final | 99 పరుగులకే 5 వికెట్లు

ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. దీంతో గుజరాత్​ ఏ దశలోనూ దూకుడుగా ఆడలేదు. 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. నిషాంత్ సిందు 20, బట్లర్​ 19 పరుగులు చేశారు. ఆర్షద్​ ఖాన్​ 15 పరుగలకే ఔట్ అయ్యాడు. పవర్ ​ప్లేలో గుజరాత్ 45 పరుగులు మాత్రమే చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్​టన్​ సుందర్​ (28), రాహుల్​ తెవాటియా ఉన్నారు.

 

దీనిని కూడా చదవండి : Champions League Celebrations | ఛాంపియన్స్​ లీగ్​లో గెలుపు.. హింసాత్మకంగా మారిన సంబరాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *