క్రీడలుRCB Playoffs Qualification | పంజాబ్​పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

RCB Playoffs Qualification | పంజాబ్​పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

డిఫెండింగ్​ ఛాంపియన్​ ఆర్సీబీ మరోసారి ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​కు దూసుకెళ్లింది. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RCB Playoffs Qualification | డిఫెండింగ్​ ఛాంపియన్​ ఆర్సీబీ (RCB) మరోసారి ఐపీఎల్ (IPL)​ ప్లే ఆఫ్స్​కు దూసుకెళ్లింది. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్​కు క్వాలీఫై అయింది.

ఐపీఎల్​లో ఆదివారం సాయంత్రం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, పంజాబ్​ కింగ్స్ (PBKS)​ మధ్య మ్యాచ్​ జరిగింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. వెంకటేష్​ అయ్యార్​ 40 బంతుల్లో 73 పరుగులతో రాణించాడు. విరాట్ కోహ్లీ 58, పడిక్కల్ 45 పరుగులు చేశారు. టిమ్​ డేవిడ్​ చివర్లో 12 బంతుల్లో 28 పరుగులతో ఆకట్టుకున్నాడు.

RCB Playoffs Qualification | ఓపెనర్లు విఫలం

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్​లో నిలకడగా ఆడుతున్న ఆ జట్టు ఓపెనర్లు ప్రియాన్ష్​ ఆర్య (0), ప్రభుమాన్​ సింగ్ (2)​ కీలకమైన మ్యాచ్​లో విఫలం అయ్యారు. ఇద్దరు ఓపెనర్లను భువనేశ్వర్​ కుమార్ ఔట్​ చేశాడు. అనంతరం కెప్టెన్​ శ్రేయాస్​ అయ్యార్​ సైతం ఒక పరుగుకే పెవిలియన్​కు చేరాడు. కూపర్​ 37, శుయాంస్​ 35, స్టోయినిస్​ 37, శశాంక్​ సింగ్​ 56 పరుగులు చేశారు. అయినా మ్యాచ్​ను గెలిపించలేకపోయారు. 20 ఓవర్లలో పంజాబ్​ 199 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్​కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.

RCB Playoffs Qualification | పంజాబ్​ కష్టమే..

ప్రస్తుతం ఆర్సీబీ 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్​కు దూసుకెళ్లింది. గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఎస్​ఆర్​హెచ్​ 14, పంజాబ్​ 13 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్​ గెలిస్తే పంజాబ్​ ప్లే ఆఫ్స్​ చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. తాజా ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్​ వెళ్లడం కష్టంగా మారింది. ఇంకో మ్యాచ్​లో గెలవడంతో పాటు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి పంజాబ్​ కింగ్స్​ భవిష్యత్ ఉంది.

దీనిని కూడా చదవండి : Dhoni Farewell | ధోనీకి చెపాక్‌లో వీడ్కోలా..? సీఎస్కే చివరి హోమ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...