Transport Department Transfers | రవాణా శాఖలో భారీగా బదిలీలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Transport Department Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రవాణా శాఖలో భారీగా ఉద్యోగులను బదిలీ చేసింది. చాలా కాలంగా ఒకే చోట పని చేస్తున్న వారికి స్థానచలనం కలిగింది.

Transport Department Transfers

రాష్ట్రంలో వివిధ శాఖల్లో బదిలీలకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది బదిలీల ప్రక్రియ పూర్తయింది. తాజాగా రవాణా శాఖలో మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్​ మోటార్​ వెహికల్ ఇన్​స్పెక్టర్ల (ఏఎంవీఐ)ను ట్రాన్స్​ఫర్​ చేసింది. ఈ మేరకు ట్రాన్స్​పోర్ట్ కమిషనర్​ కె ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Transport Department Transfers | రెండు మల్టీజోన్ల పరిధిలో..

Transport Department Transfers

మల్టీ జోన్ 1 పరిధిలో 41 మంది ఎంవీఐలు, 42 మంది ఏఎంవీఐలు బదిలీ అయ్యారు. మల్టీ జోన్​–2 పరిధిలో 52 మంది ఎంవీఐలు, 40 మంది ఏఎంవీఐలు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఉద్యోగుల అభ్యర్థన, స్పౌస్​, ఇతర కారణాలతో బదిలీలు చేపట్టారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖలోని ఐదు జోన్ల పరిధిలో పని చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్లను కూడా ట్రాన్స్​ఫర్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Data Centers | ఐటీ హబ్‌గానే కాదు.. డేటా సెంటర్‌ ‘పవర్‌ హౌస్’​గానూ హైదరాబాద్ జోరు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *