Flex Fuel Bike | ఇక పెట్రోల్ చింత అక్కర్లేదు.. త్వరలో మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flex Fuel Bike | దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సామాన్యులు బైక్ తీయాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల దిశగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కీలక అడుగు వేస్తోంది. సంస్థ తన తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించడానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈనెల 3న ఈ కొత్త టెక్నాలజీ బైక్‌ను లాంచ్ చేయనుంది.

Flex Fuel Bike | 100 శాతం ఇథనాల్‌తో..

Flex Fuel Bike

 

హీరో తీసుకువస్తున్న ఈ సరికొత్త బైక్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పెట్రోల్ అవసరం లేకుండా 100 శాతం ఇథనాల్ తో నడవగలదు. ప్రస్తుతం భారతదేశంలో ఈ-20 ఇంధనం వినియోగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ-100 వరకు ఉన్న అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల చమురు దిగుమతుల భారం తగ్గడంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హీరో మోటార్ కార్ప్ వంద శాతం ఇథనాల్‌తో నడిచే మొదటి బైక్‌ను తీసుకువస్తోంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలు చాలా వేగంగా తగ్గుతాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనం ధర తగ్గే అవకాశాలున్నాయి.

Flex Fuel Bike | స్ప్లెండర్ లేదా హెచఎఫ్ డీలక్స్?

Flex Fuel Bike

హీరో మోటోకార్ప్ విడుదల చేయనున్న ఈ100 మోడల్ పేరును ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ బైక్ స్ప్లెండర్ లేదా హెచ్​ఎఫ్ డీలక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన మార్కెట్లోకి రాబోయేది ఈ రెండింటిలో ఏదో ఒకటి లేదా ఈ రెండు మోడల్స్ కూడా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశంలో గ్రీన్ మొబిలిటీ వైపు మార్పు వేగవంతమవుతున్న తరుణంలో హీరో మోటోకార్ప్ కొత్త అడుగు ద్విచక్ర వాహన రంగంలో కొత్త దిశను చూపనుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఫ్లాట్ గా దేశీయ స్టాక్ మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *