Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్​కు ఫిర్యాదు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Velpur VDC | తమను సాంఘిక బహిష్కరణ చేశారని వేల్పూరు గంగపుత్ర సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీపై కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

వేల్పూర్ (Velpur) గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు సోమవారం కలెక్టరేట్​కు వచ్చారు. వారు మాట్లాడుతూ.. తాము గ్రామంలోని చెరువుల్లో చేపలు పడుతూ జీవిస్తున్నామని చెప్పారు. కొంతకాలంగా గ్రామంలోని వీడీసీ సభ్యులు తమపై అణచివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Velpur VDC | జరిమానా కట్టకపోవడంతో..

Velpur VDC

తాము చేపలు పట్టుకోవడానికి వీడీసీ వారు రూ.50 వేల జరిమానా వేశారని సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆ డబ్బులు కట్టకపోవడంతో తమ సంఘంలోని సభ్యులందరిని సాంఘిక బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడీసీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Velpur VDC

ఇది కూడా చదవండి..: Nizamabad Road Accident | నగరంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం.. 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *