Stock Market Losses | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. రూ. 4.25 లక్షల కోట్ల సంపద ఆవిరి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | అమెరికా -ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రతిపాదిత 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇంకా ఆమోదించలేదు.

ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను తొందరపడడం లేదని ట్రంప్ పేర్కొనడంతో అనిశ్చిత పరిస్థితులు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 164 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి క్రమంగా పడిపోతూ 1,164 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 375 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 508 పాయింట్ల నష్టంతో 74,267 వద్ద, నిఫ్టీ 165 పాయింట్ల నష్టంతో 23,382 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | ఆదుకున్న ఐటీ సెక్టార్

Stock Market Losses

బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ (Nifty)లను భారీ పతనం నుంచి ఐటీ సెక్టార్ ఆదుకుంది. నిఫ్టీ ఐటీ సూచీ 2.66 శాతం పెరగ్గా.. మీడియా 1.37 శాతం, మెటల్ 0.49 శాతం లాభపడ్డాయి. పవర్ ఇండెక్స్ 2.90 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.44 శాతం, ఎఫ్ ఎంసీజీ 2.30 శాతం, యుటిలిటీ 2.12 శాతం, ఆటో 1.70 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.39 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.30 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.10 శాతం నష్టపోయాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,589 కంపెనీలు లాభపడగా 2,761 స్టాక్స్ నష్టపోయాయి. 199 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 153 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 4.25 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

Stock Market Losses

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 3.80 శాతం, ఇన్ఫోసిస్ 3.70 శాతం, టీసీఎస్ 1.95 శాతం, ఇండిగో 1.04 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.90 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్యూఎల్ 2.83 శాతం, ఐటీసీ 2.53 శాతం, ఎన్టీపీసీ 2.15 శాతం, ఎంఅండ్ ఎం 2.10 శాతం, కొటక్ బ్యాంక్ 1.95 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: UPI Transactions Record | యూపీఐ జోరు.. మేలో సరికొత్త రికార్డు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *