Indian Stock Market | మళ్లీ నష్టాలే!

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | కీలకమైన యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలకు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో యూఎస్ ఫ్యూచర్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సైతం నెగెటివ్‌గా స్పందించాయి. ఐటీ, కన్జూమర్ డ్యూరెబుల్స్ రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

బుధవారం ఉదయం సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 94 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 514 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో ప్రారంభమై 37 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 171 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో 77,472 వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 24,207 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,375 కంపెనీలు లాభపడగా 1,944 స్టాక్స్ నష్టపోయాయి. 221 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 156 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 90 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. కొటక్ బ్యాంక్ 3.53 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.87 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.33 శాతం, టాటా స్టీల్ 1.10 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.70 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 1.94 శాతం, ఎయిర్‌టెల్ 1.91 శాతం, ఎల్టీ 1.76 శాతం, పవర్‌గ్రిడ్ 1.48 శాతం, టెక్ మహీంద్రా 1.38 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Invesco India Midcap Fund | ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ 3 ఏళ్ల CAGR 24.04 శాతం రాబడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *