జాతీయంKharge Comments | మోదీ ఒక టెర్రరిస్ట్​.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

Kharge Comments | మోదీ ఒక టెర్రరిస్ట్​.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharge Comments | కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే (Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ (PM Modi)ని టెర్రరిస్ట్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Elections) కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఏఐఏడీఎంకేను విమర్శిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని “ఉగ్రవాది” అని ఖర్గే వివాదాన్ని రేకెత్తించారు.

చెన్నైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, “వారు (AIADMK) మోదీతో ఎలా చేతులు కలపగలరు? ఆయన ఒక ఉగ్రవాది. ఆయన సమానత్వాన్ని విశ్వసించరు. ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. ఇలాంటి వారితో వీరు చేతులు కలుపుతున్నారు. అంటే వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం,” అని పేర్కొన్నారు.

Kharge Comments | వ్యాఖ్యలపై వివరణ

ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యపై ఖర్గే వివరణ ఇస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ (BJP)తో కుమ్మక్కై పనిచేస్తున్నందున, ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను “భయభ్రాంతులకు గురిచేస్తున్నారని” ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తమను బెదిరిస్తుంటారని తాను చెప్పాలని అనుకున్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ (ED), ఇతర సంస్థలు ఆయన చేతుల్లోనే ఉన్నాయని చెప్పానని, ఆయన స్వయంగా ఉగ్రవాది తాను ఎప్పుడూ అనలేదన్నారు.

Kharge Comments | బీజేపీ ఆగ్రహం

ప్రధాని మోదీపై ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’ వ్యాఖ్యను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు, అలాగే ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిని ఉగ్రవాది అని పిలిచారని మండిపడ్డారు. ఆయనను, మన దేశ ప్రజలను అవమానించినందుకు ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

mallikarjun kharge

దీనిని కూడా చదవండి : Tamil Nadu Election | తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...