Stock Market Recovery | నాలుగు రోజుల నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన మార్కెట్లు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Recovery | పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో నాలుగు రోజులుగా నష్టాలతో ముగుస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్.. మంగళవారం కోలుకుంది. ఐటీ దిగ్గ్పు కంపెనీలలో విలువ ఆధారిత కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాట పట్టింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో ముగిశాయి.

Stock Market Recovery | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైనా..

 

Stock Market Recovery

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 322 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 130 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 1,045 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 153 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 328 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 382 పాయింట్ల నష్టంతో 74,649 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 23,483 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Recovery | ఐటీ సెక్టార్ లో కొనసాగిన జోరు..

ఐటీ సెక్టార్‌లో జోరు కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty) ఐటీ సూచీ 4.23 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.23 శాతం, టెలికాం 0.95 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.76 శాతం, ఆటో 0.72 శాతం లాభపడగా.. ఫార్మా 0.86 శాతం, యుటిలిటీ 0.61 శాతం, పవర్ 0.61 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.18 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.17 శాతం నష్టపోయాయి.

Stock Market Recovery | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Recovery

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,301 కంపెనీలు లాభపడగా 1,904 స్టాక్స్ నష్టపోయాయి. 172 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 93 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ 6.53 శాతం, ఇన్ఫోసిస్ 5.66 శాతం, హెచ్సీఎల్ టెక్ 4.08 శాతం, అదానీపోర్ట్స్ 1.84 శాతం, టెక్ మహీంద్రా 1.76 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎన్టీపీసీ 2.89 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.74 శాతం, పవర్ గ్రిడ్ 1.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.06 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.91 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: CMR Green IPO | ఐపీవోకు గ్రీన్ టెక్నాలజీ కంపెనీ.. రేపటినుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *