June 23 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 23 Market Analysis | ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం(Inflation) ప్రమాదంతో సహా ప్రపంచ ఆర్థిక పర్యవసానాలపై ఆందోళనల కంటే ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడం చాలా ముఖ్యమని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) పేర్కొన్నారు. దీంతో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఈ ఒప్పందంపై ప్రపంచ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి అందుతున్న మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

June 23 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

యుద్ధం కారణంగా అమెరికాలో ద్రవోల్బణం పెరిగి, వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉండడంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.32 శాతం, ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం లాభంతో ఉంది.

June 23 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.71 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.61 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.25 శాతం, నష్టపోయింది.

Mamata Banerjee TMC | బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMC చీఫ్​ పదవి నుంచి మమత తొలగింపు!

June 23 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.32 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.22 శాతం, లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 4.45 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.94 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.33 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.17 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.10 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 635.91 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,035.72 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.91 నుంచి 0.97 కు పెరిగింది.
  • విక్స్ 0.98 శాతం తగ్గి 12.84 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు బలహీనపడి 94.68 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.50 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 78 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *