ACB Raids Hyderabad | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids Hyderabad | ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, సస్పెండ్​ అయిన అడిషనల్​ ఎస్పీ భుజంగరావు ఇల్లు, అతడి బంధువులు, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు (ACB Officers) సోదాలు చేపట్టారు.

ACB Raids Hyderabad

నగరంలోని మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్​ హయాంలో అనేక మంది ఫోన్లు ట్యాప్​ చేశారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వ్యాపారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లను ట్యాప్​ చేశారు. ఈ క్రమంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భుజంగరావు (Bhujangarao) సైతం భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. దీంతో నగరంతో పాటు సూర్యాపేటలోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ACB Raids Hyderabad | గతంలోనే సస్పెండ్

ACB Raids Hyderabad

అదనపు ఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావును గతంలోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఏసీబీ సోదాలు (ACB Raids) చేపట్టడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఆయనకు చెందిన పదిహేను చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయ్యాక అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Sangareddy Drugs Bust | మారుమూల గ్రామంలో ఫామ్​హౌస్​.. లోపల ఏం జరగుతుందో తెలిస్తే షాక్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *