అక్షరటుడే, వెబ్డెస్క్: Kolkata Cash Bundles | కోల్‌కతాలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఓ కాలేజీ చెదలు పట్టిన స్థితిలో రూ.కోటి కరెన్సీ కట్టలు లభ్యం అయ్యాయి.
కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ (Surendranath College)లో యూనియన్ గదిలో రెండు సూట్‌కేసులలో చెదలు పట్టిన నగదు కట్టలు దొరికాయి. వర్షాకాలానికి ముందు కళాశాలలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమం సందర్భంగా, అధికంగా రూ.100, రూ.500 నోట్లతో కూడిన ఈ నగదు లభించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను శుభ్రం చేసుకోవాలని పౌర అధికారులు ఇటీవల సూచించారు.
Kolkata Cash Bundles | టీఎంసీ నేతల డబ్బు

కాగా ఎన్నికల సమయంలో కాలేజీలోని ఆ గదిని టీఎంసీ నాయకులు (TMC Leaders) ఉపయోగించుకున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఎన్నికల్లో పంచడానికి ఆ డబ్బు తెచ్చారని పేర్కొంది. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా “చాలా నోట్లు పాడైపోయి, మురికిగా ఉన్నాయి. పూర్తి వివరాల జాబితాను సిద్ధం చేస్తున్నారు, ధృవీకరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం,” అని ఒక అధికారి తెలిపారు.
Kolkata Cash Bundles | రహస్య గది

తృణమూల్ కాంగ్రెస్ నాయకులది అవినీతి అని బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ (BJP MLA Sajal Ghosh) ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎవరికీ తెలియకుండా కళాశాల యూనియన్ గదిలో ఎలా ఉండగలదని ఆయన ప్రశ్నించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నగదుకు సంబంధించి కళాశాల అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. చెదలు పట్టిన నగదును కనుగొన్న మరుసటి రోజే, సురేంద్రనాథ్ కళాశాలలో తృణమూల్ నాయకుడికి చెందినదిగా భావిస్తున్న ఒక ‘రహస్య గది’ని అధికారులు కనుగొన్నారు. అందులో ఏసీ పరుపు, గడియారం, గోడ చిత్రాలతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: US Tariffs Proposal | భారత్‌కు అమెరికా మరో షాక్.. 12.5శాతం అదనపు సుంకాలకు ప్రతిపాదన
