Ganja Plants Seized | ఇంటిపై గంజాయి మొక్కలు పెంచిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganja Plants Seized | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఎంతో మంది దీనికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

నగరంలోని నాచారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతంలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేసేవాడు. అతడికి గంజాయి అలవాటు అయింది. ఆ విషయంలో ఆఫీసులో తెలియడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఈ క్రమంలో ఇంటి వద్దే గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. పక్కా సమాచారం మేరకు రంగారెడ్డి (Rangareddy) ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటి మీద కుండీల్లో పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొక్కలు సుమారు 10 కిలోల దిగుబడినిస్తాయని అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Ganja Plants Seized | బీటెక్​ విద్యార్థులు అరెస్ట్

నగరంలోని మేడిపల్లి (Medipally) వద్ద గంజాయితో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు (B Tech Students) దొరికారు. వారి నుంచి పోలీసులు 480 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. దీంతో విద్యార్థులు, యువత దీనిని అలవాటు పడుతున్నారు. చదువుకోవాల్సిన సమయంలో వ్యసనాల బారీన పడి జీవితాలను, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా గంజాయి దందా మాత్రం ఆగడం లేదు.

ganja

దీనిని కూడా చదవండి : Mancherial Murder Case | మంచిర్యాలలో దారుణం.. రూ.100 కోసం హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *