Attapur Murder Case | కళ్లముందే కన్నతల్లి దారుణ హత్య.. అత్తాపూర్ ఘటనపై కుమారుడు చెప్పిన షాకింగ్ నిజాలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Attapur Murder Case | రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో అనుమానంతో భార్యను భర్త కిరాతకంగా విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ భయంకరమైన ఘాతుకానికి సంబంధించి మృతురాలి కుమారుడు కళ్లారా చూసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కన్నతండ్రి రాక్షసత్వాన్ని, తల్లి అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకుంటూ ఆ బాలుడు చెప్పిన మాటలు స్థానికులను కన్నీటిపర్యంతం చేశాయి.
attapur.1

 

Attapur Murder Case | బాలుడి కథనం ప్రకారం..

అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు భార్య కోమలపై ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ప్రాణభయంతో కోమల గదిలోంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నించింది. అయినా సరే ఆ కిరాతకుడు వదలకుండా ఆమెను వెంబడించాడు. కత్తితో పాటు ఇంట్లోని స్క్రూడ్రైవర్, ఇనుప రాడ్‌ను తీసుకుని ఆమెపై క్రూరంగా దాడి చేసాడు.

Attapur Murder Case | ‘నాన్నా కొట్టకు’ అని వేడుకున్నా..

కళ్ల ముందే కన్నతల్లి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే ఆ బాబు తట్టుకోలేకపోయాడు. తండ్రి కాళ్లు పట్టుకుని, “నాన్నా.. ప్లీజ్ అమ్మను కొట్టకు నాన్నా..” అంటూ అడ్డువెళ్లాడు. కానీ, కళ్లు గప్పేసిన ఆ కిరాతకుడు కొడుకు ఆర్తనాదాలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. రాడ్‌తో కోమలను తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడివున్న కోమలను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చేర్చిన కేవలం ఐదు నిమిషాలకే ఆమె ప్రాణాలు విడిచిందని బాలుడు కన్నీరుమున్నీరయ్యాడు. కళ్లముందే తల్లి ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేకపోయానంటూ ఆ బాలుడు రోదించిన తీరు ప్రతీ ఒక్కరినీ కదిలించివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
attpur.2

 

ఇది కూడా చదవండి:  Revanth Reddy Harvard Training | హార్వర్డ్​లో సీఎం శిక్షణపై ఎంపీ అర్వింద్​ కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *