అక్షరటుడే, వెబ్డెస్క్ : KA Paul Counter | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు. తమ్ముడూ పవన్ కళ్యాణ్ ఎందుకీ గొడవలు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు.
పవన్ ఇటీవల తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆయన సభకు అనుమతి ఇవ్వకపోవడంతో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అన్నారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) నేతలు కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతోంది. ఆయన మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
KA Paul Counter | హామీలు అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే, అవి మానేసి ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకని కేఏ పాల్ అన్నారు. జూన్ 14న నేను హ్యూస్టన్‌లో పెద్ద సభ పెట్టబోతున్నానని ఆయన తెలిపారు. ఆ సభకు రమ్మంటూ పవన్‌ను ఆహ్వానించారు.
తమ్ముడూ పవన్ కళ్యాణ్ ఎందుకీ గొడవలు ?
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా ?
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే, అవి మానేసి ఎందుకు ఈ గొడవలన్నీ – కె.ఏ పాల్ pic.twitter.com/cROXGEFZOu
— News Line Telugu (@NewsLineTelugu) June 5, 2026
దీనిని కూడా చదవండి : Grain Procurement Dispute | ధాన్యం కొనుగోళ్లు చేతగాక.. కేంద్రంపై విమర్శలు : ఎంపీ అర్వింద్
