Revanth Reddy | హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Revanth Reddy | హైదరాబాద్‌ (Hyderabad) లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Hpuses) నిర్మిస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. 2034లోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించారు.

నాచారంలో బాలామృతం ఉత్తత్తి ప్లాంట్​ను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గర్భిణులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగింది, ఇవాళ నూతన బాలామృతం ప్లాంట్ ప్రారంభించుకున్నామని చెప్పారు.

Revanth Reddy | మహిళా సంక్షేమమే ధ్యేయంగా..

తమ ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఫ్రీబస్సు కల్పించామని, మహిళల పేర్లపైనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలను పెట్రోల్‌ బంకుల యాజమానులుగా చేశామన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించామన్నారు.

Revanth Reddy | విద్యార్థుల కోసం..

balamrutham plant

పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం తీసుకొచ్చామని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ పెడుతున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఓటు బ్యాంకు పథకాలు కాదు, విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

దీనిని కూడా చదవండి : Wayanad Landslide | వయనాడ్‌లో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *