Pakistan Global Diplomacy | పాకిస్థాన్ సరికొత్త దౌత్య వ్యూహం.. మధ్యవర్తిగా వ్యవహరింపు.. తనపై పడిన మచ్చలు తొలగించుకునే యత్నం!

Naresh Chandan
Pakistan Global Diplomacy

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan Global Diplomacy | ఇటీవలి కాలం వరకు అంతర్జాతీయ వేదికలపై ఒంటరిగా మారిన పాకిస్థాన్.. తాజాగా అనూహ్యంగా గ్లోబల్ డిప్లొమసీకి కేంద్ర బిందువుగా మారేందుకు యత్నిస్తోంది.

అమెరికా – ఇరాన్ వంటి బద్ధ శత్రువులను చర్చల మేజాపైకి తీసుకురావడంలో పాక్​ తీవ్రంగా యత్నిస్తోంది. ఈ పరిణామాలపై ‘ఇండియా టుడే గ్లోబల్’ ప్రసారం చేసిన ‘స్టేట్‌క్రాఫ్ట్’ (Statecraft) కార్యక్రమంలో గీతా మోహన్ పూర్తి వివరాలు వెల్లడించారు.

pak PM

Pakistan Global Diplomacy | అనూహ్యమైన మధ్యవర్తిత్వం:

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత “అబద్ధాలకోరు” అని విమర్శలు ఎదుర్కొన్న పాక్​.. నేడు అదే ట్రంప్ పరిపాలనలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని దేశంగా, రహస్యంగా అణు ఆయుధాలను తయారు చేసిన చరిత్ర కలిగిన పాక్​.. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం యత్నిస్తూ.. అంతర్జాతీయ వర్గాలను ఆకర్షిస్తోంది.

Pakistan Global Diplomacy | ‘త్రీ సీస్’ (3 Cs) వ్యూహం:

ట్రంప్ లావాదేవీల దృక్పథాన్ని (Transactional approach) అర్థం చేసుకున్న పాక్​.. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించి అమెరికాను ఆకట్టుకుంటోంది.

కౌంటర్ టెర్రరిజం (Counterterrorism): 2021 కాబూల్ ఎయిర్‌పోర్ట్ పేలుళ్లతో సంబంధం ఉన్న నిందితుడిని అమెరికాకు అప్పగించడం ద్వారా పాక్​ తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

క్రిటికల్ మినరల్స్ (Critical Minerals): పాక్​లోని అపారమైన లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజ నిక్షేపాల తవ్వకం కోసం అమెరికా కంపెనీలతో 500 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. ఇది సరఫరా గొలుసులో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికాకు సహాయపడుతుందంటున్నారు.

క్రిప్టో కరెన్సీ (Crypto): అమెరికాలో ట్రంప్ అనుకూల క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా పాక్​ తన దేశంలో క్రిప్టో నిబంధనలు సడలించింది.trump

Pakistan Global Diplomacy | ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం:

పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేరుగా ట్రంప్‌తో సంబంధాలను బలపరుచుకుంటున్నారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ కారణమని కొనియాడటమే కాకుండా, ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఇలా ఏర్పర్చుకున్న మార్గం ద్వారానే 2026 ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య మొదటి దశ చర్చలు విజయవంతంగా నిర్వహించారు.

భారత్ – చైనా స్పందన:

భారత్: మరోవైపు భారత్ నిశ్శబ్దంగా తన సైనిక శక్తిని పెంచుకుంటోంది. జర్మనీతో దాదాపు 5 బిలియన్ యూరోల విలువైన సబ్‌మెరైన్ (జలాంతర్గామి) ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంటోంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాక్​ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇది అత్యంత కీలకంగా భావిస్తున్నారు..

చైనా: అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తినా తట్టుకునేలా చైనా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ముడి చమురు నిల్వలను పెంచుకోవడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వైపు వేగంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: Tim Cook Resignation | యాపిల్​ సీఈవో టిమ్ కుక్ తన బాధ్యతలకు గుడ్​బై.. కొత్త సారథిగా జాన్​ టెర్నస్​!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *