అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana RTC Strike 1 | ప్రభుత్వ కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలం కావడంతో తెలంగాణలో ఆర్టీసీ బంద్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు కదలడం లేదు.

Telangana RTC Strike 1 | డిపోల ఎదుట ఆందోళనలు
హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచే కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు ఉదయం కార్మికులు డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఆటోలకు డిమాండ్..
రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సుమారు 35 లక్షల మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు.
కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేందుకు పాట్లు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో ఆటోలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆటోవాలాలు ఛార్జీలు పెంచేశారు.
ఇది కూడా చదవండి: April 22 Horoscope | రాయల్టీలతో కాసుల వర్షం.. ఈ రాశుల వారికి తలుపు తట్టబోతున్న అదృష్టం!

