Maruti Car Offers | మారుతిదీ అదే దారి.. కార్లపై భారీ ఆఫర్లు..

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​:  Maruti Car Offers | దేశీయ కార్ల మార్కెట్‌లో తన వాటాను మరింత పెంచుకోవడం కోసం మారుతి సుజుకీ ఇండియా (Maruti Suzuki India) ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. తాజాగా జూన్ నెలకు సంబంధించిన ఆఫర్లను ప్రకటించింది.

పలు మోడళ్లపై భారీ ప్రయోజనాలను కల్పించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో ఈ ప్రయోజనాలుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందామా..

ఎంపీవీ కేటగిరీకి చెందిన ఇన్విక్టో పై గరిష్టంగా రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందించనుంది.
గ్రాండ్ విటారా ఎస్‌యూవీ పెట్రోల్ వేరియంట్లపై రూ. 85 వేల నుంచి రూ. 1.35 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్లకు ఢిల్లీలో అదనపు రోడ్‌ట్యాక్స్ బెనిఫిట్స్ లభించనున్నాయి. ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలతో పాటు మొత్తం ఆదా గరిష్టంగా రూ. 1.85 లక్షల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Maruti Car Offers | ఇతర మోడళ్లపై..

Maruti Car Offers

ఇగ్నిస్‌పై రూ. 45వేల వరకు బెనిఫిట్స్ అందనున్నాయి.
ఎక్స్ ఎల్ 6పై రూ. 45వేల వరకు ప్రయోజనాలుంటాయి.
జిమ్నీ మోడల్ పై రూ. 45వేలు, బాలెనోపై రూ. 40వేలు, ఫ్రాంక్స్ వేరియంట్ బట్టి రూ. 25వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ ఆఫర్లు నెలాఖరు వరకు లేదా స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. కారు మోడల్, వేరియంట్, ప్రాంతం, స్టాక్‌ను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ కోసం సమీపంలోని కంపెనీ డీలర్‌ను సంప్రదించండి.

ఇది కూడా చదవండి..: Hyundai Car Offers | హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *