Heatwave Alert | మళ్లీ పెరగనున్న ఎండల తీవ్రత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heatwave Alert | రాష్ట్రంలో ఎండ తీవ్రత మళ్లీ పెరగనుంది. రెండు రోజులుగా చల్లబడిన వాతావరణం వేడెక్కనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) సూచించారు.

తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, వడగాళ్ల వానలతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే గురువార నుంచి భానుడు మళ్లీ తన ప్రతాపం చూపుతాడని అధికారులు తెలిపారు. మొన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అయ్యాయి. రేపటి నుంచి వడగాలుల తీవ్రత, గతంలో వచ్చిన దానికంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Heatwave Alert

Heatwave Alert | జాగ్రత్తలు పాటించాలి

రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉదయం, సాయంత్రం వేళలో బయటి పనులు చేసుకోవాల్నారు. అత్యవసరం అయితే మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలని సూచించారు. నీరు ఎక్కువగా తాగాలని, తలకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana RTC Strike 1 | డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికుల పాట్లు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *