అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LPG Gas Price Hike | దేశంలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో సామాన్యలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదివారం మరోసారి రేట్లు పెరిగాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, గ్యాస్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దేశవ్యాప్తంగా రేట్లు పెరుగుతున్నాయి. ఆదివారం గృహ వినియోగ ఎల్పీజీ (LPG) ధరను సిలిండర్‌కు రూ. 29 చొప్పున పెంచారు. గత మూడు నెలల్లో ఈ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
LPG Gas Price Hike | నష్టాలను భర్తీ చేయడానికి..
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచిన కంపెనీలు తాజాగా డొమెస్టిక్ సిలిండర్ల (Domestic Cylinders) రేట్లను సైతం పెంచుతున్నాయి. మార్చి 7న సిలిండర్ ధరను రూ. 60 మేర పెంచారు. తాజాగా రూ.29 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
LPG Gas Price Hike | రూ.60 వేల కోట్ల నష్టం
పెట్రోలియం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం భారత్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు పొరుగు దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ, హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ఇంధన రవాణాను కొనసాగించిన అతికొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది, దీనివల్ల ఏ పెట్రోలియం ఉత్పత్తికీ కొరత ఏర్పడలేదు. గత ఏడాదిలో గృహ వినియోగ ఎల్పీజీపై మార్కెటింగ్ సంస్థలు సుమారు రూ. 60వేల కోట్ల నష్టాన్ని భరించాయి. అంతర్జాతీయ ముడి చమురు, ఇంధన మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా ప్రభుత్వం ఇప్పటివరకు కొంతమేర ఆ భారాన్ని ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థల ద్వారా తనపైనే వేసుకుంది.
LPG Gas Price Hike | ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
ఢిల్లీ: రూ. 942 (గతంలో రూ. 913), ముంబై: రూ. 941.40, కోల్‌కతా రూ. 968, చెన్నై: రూ. 957.50, పాట్నా: రూ. 1031.50, హైదరాబాద్ రూ. 996, లక్నో: రూ. 980, జైపూర్: రూ. 945.50, బెంగళూరు: రూ. 944.50.
Another hit to household budgets.Starting today, domestic LPG prices have been hiked by ₹29,bringing the cost of a 14.2-kg cylinder to ₹942 here in the capital.This marks the second increase in three months amid volatile global energy costs. 📉⛽ #LPGPriceHike #Delhi #Inflation pic.twitter.com/inE0olTGi0
— Deepak (@deepaknegiii) June 7, 2026
దీనిని కూడా చదవండి : Telugu Youth Murder | అమెరికాలో తెలుగు యువకుడి దారుణ హత్య
