Blinkit Snake Delivery | బ్లింక్ఇట్ బ్యాగ్ నుండి కిందపడ్డ పాము.. వీటిని కూడా డెలివరీ చేస్తున్నారా అంటూ ప్రశ్నలు

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో కళ్ళముందుకు వచ్చేస్తున్నాయి వస్తువులు. కూరగాయలు, కిరాణా సామాగ్రి నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు అన్నీ క్విక్ కామర్స్ యాప్స్ డెలివరీ చేస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Blinkit Snake Delivery | ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో కళ్ళముందుకు వచ్చేస్తున్నాయి వస్తువులు. కూరగాయలు, కిరాణా సామాగ్రి నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు అన్నీ క్విక్ కామర్స్ యాప్స్ డెలివరీ చేస్తున్నాయి. అయితే, ముంబైలో జరిగిన ఒక విచిత్రమైన ఘటన చూస్తే.. “ఇప్పుడు పాములను కూడా ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తున్నారా?” అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు.

Blinkit Snake Delivery |ఒక షాకింగ్ దృశ్యం ..

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఎవ్వరూ ఊహించని ఒక షాకింగ్ దృశ్యం వెలుగుచూసింది. ఒక ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘బ్లింక్ఇట్’ (Blinkit) డెలివరీ ఏజెంట్ ఎప్పటిలాగే తన ఆర్డర్లను డెలివరీ చేయడానికి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే, పట్టపగలే అందరూ చూస్తుండగానే అతని డెలివరీ బ్యాగ్ లో నుంచి ఒక్కసారిగా ఒక పాము కింద పడింది.
snake.1

 

Blinkit Snake Delivery |తాపీగా బ్యాగులో వేసుకుని..

రోడ్డుపై పాము పడటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భయంతో ఏం చేయాలో పాలుపోక చూస్తుండగానే.. ఆ డెలివరీ ఏజెంట్ మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. ఎంతో తాపీగా, ప్రశాంతంగా ఆ పామును పట్టుకుని తిరిగి తన డెలివరీ బ్యాగులోనే వేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్టు అక్కడి నుంచి బైక్‌పై వెళ్ళిపోయాడు.

snake.2

Blinkit Snake Delivery |పాములను కూడా డెలివరీ చేస్తున్నారా?

ఈ విచిత్ర దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ మధ్య కాలంలో పాములను కూడా డెలివరీ చేస్తున్నారా?” అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతుండగా.. “ఆ బ్యాగులో ఉన్న కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువుల పరిస్థితి ఏంటి?” అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ వాడే బ్యాగుల పరిశుభ్రత, భద్రతపై కూడా ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 

ఇది కూడా చదవండి:  Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *