June 08 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 08 Market Analysis | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలతో క్రూడ్ ఆయిల్ ధర సైతం పైపైకి ఎగబాకుతోంది. దీంతో పాటు అమెరికాలో వరుసగా 3వ నెలలోనూ బలమైన ఉద్యోగాల వృద్ధిని నమోదు కావడంతో ఇన్ఫ్లెషన్ ను కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను పెంచుతారేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో భారీ పతనం కనిపిస్తోంది. అయితే భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్ మరియు నిఫ్టీ సోమవారం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలిస్తోంది.

June 08 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

టెక్నాలజీ స్టాక్స్‌లో భారీ పతనం కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాలతో ముగిసింది. దీంతో దాని తొమ్మిది వారాల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 4.18 శాతం, ఎస్ అండ్ పీ 2.64 శాతం నష్టపోగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో ఉంది.

June 08 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.32 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.75 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.07 శాతం పెరిగింది.

June 08 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.08 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 4.17 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.90 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.42 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.06 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.83 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.23 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Philippines Huge Earthquake | ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన వరుస భూకంపాలు.. సునామీ హెచ్చరికలు జారీ!

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు వరుసగా 8వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,776 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 14వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 9,133 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1 నుంచి 0.83 కి తగ్గింది.
  • విక్స్ 0.61 శాతం తగ్గి 15.78 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96.52 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 85 పైసలు బలపడి 94.95 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.07 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.57 వద్ద ఉన్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *