Future City Legal Protection | ఫ్యూచర్​ సిటీకి చట్టపరమైన రక్షణ.. ప్రభుత్వం కసరత్తు

ఫ్యూచర్​ సిటీని రద్దు చేసే అవకాశం లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Future City Legal Protection | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్​ సిటీ నిర్మాణానికి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్​లో రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ వసతులతో నాలుగో సిటీ నిర్మించడానికి కసరత్తు చేస్తోంది.

ఫ్యూచర్​ సిటీతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలను ఆహ్వానిస్తోంది. అయితే తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు (Harish Rao) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆలోచిస్తాయి. దీంతో ప్రభుత్వం ఫ్యూచర్​ సిటీకి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు సిద్ధమైంది. భవిష్యత్​లో దానిని రద్దు చేయకుండా 7 మండలాలు, 56 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రీన్ ఫార్మా సిటీ డెఫినిషన్‌ను ‘అర్బన్‌నెటివ్ అండ్ హ్యూమన్ పబ్లిక్ పర్పస్’గా మారుస్తూ భూసేకరణ చట్టం సెక్షన్ 2 ప్రకారం నిబంధనల సవరణకు కసరత్తు చేస్తోంది.

Future City Legal Protection | భరోసా కల్పించడానికి..

అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భరోసా కల్పించేలా లీగల్ ఇమ్యూనిటీ కల్పించేలా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో ముచ్చర్ల పరిసరాల్లో  సేకరించిన వేల ఎకరాల భూమి కేవలం ‘గ్రీన్ ఫార్మా సిటీ కోసం ’ అనే నిబంధనను సవరించనుంది. దీనిని ఎకో ఫ్రెండ్లీ మల్టీపర్పస్​ మెగా ప్రాజెక్టు కింద ‘ఆల్టర్‌‌‌‌‌‌‌‌నేటివ్​ అండ్​ హయ్యర్​ పబ్లిక్ పర్పస్’గా మార్చాలని యోచిస్తోంది. ప్రస్తుత నిబంధన ప్రకారం ఆ భూమిని ఫార్మా సిటీ (Pharma City) కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని రకాలుగా భూమిని వినియోగించుకునే హక్కు ప్రభుత్వానికి ఉండేలా చట్ట సవరణ చేయనున్నారు.

Future City Legal Protection | శాశ్వత యాజమాన్య హక్కులు

ఫ్యూచర్​ సిటీ (Future City)లో అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. చాలా కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా కంపెనీలకు ‘సేల్ డీడ్ ఇండెమ్నిటీ పాలసీ’ ద్వారా శాశ్వత యాజమాన్య హక్కులను బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో కంపెనీలకు స్థలాలను లీజుకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఫ్యూచర్​ సిటీలో హెల్త్​ సిటీ, గ్లోబల్ డేటా సెంటర్లు,  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌‌మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, సింగరేణి కాలరీస్ కొత్త ప్రధాన కార్యాలయం, తోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో లెదర్ స్కిల్ యూనివర్సిటీలాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భవన సముదాయాలు నిర్మించనున్నారు.

ఇది కూడా చదవండి..: International Medical Tourism | తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం’!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *