Iran Israel Missile Attacks | మళ్లీ మొదలైన యుద్ధం.. క్షిపణులతో ఇరాన్​, ఇజ్రాయెల్​ దాడులు

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran Israel Missile Attacks | పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. మిస్సైళ్లతో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది.

ఇజ్రాయెల్​పై ఇరాన్​ మొదట క్షిపణులతో దాడులు చేసింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇరాన్​ ఇజ్రాయెల్ (Israel)​పై దాడులు చేపట్టింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించింది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు అమెరికాతో శాంతి ఒప్పందానికి ఈ దాడులు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

Iran Israel Missile Attacks | టెహ్రాన్​లో..

టెహ్రాన్‌లో రెండు శక్తివంతమైన పేలుళ్లు వినిపించాయని, ఇస్ఫహాన్, కరాజ్ మరియు తబ్రిజ్ నగరాల్లో కనీసం మూడు పేలుళ్లు వినిపించాయని అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని మహ్‌షహర్‌లో ఉన్న ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. నెవాటిమ్, టెల్ నోఫ్‌లోని ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడం ద్వారా తాము ప్రతీకారం తీర్చుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ పేర్కొంది.

Iran Israel Missile Attacks | గగనతలం మూసివేత

ఇజ్రాయెల్ దాడి తరువాత ఇరాన్ తన ప్రధాన విమానాశ్రయమైన టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఉన్న గగనతలాన్ని మూసివేసింది. ఇజ్రాయెల్ తమ భూభాగాలపై దాడులు కొనసాగిస్తున్నందున, గల్ఫ్‌లోని అన్ని అమెరికా స్థావరాలను కూడా టెహ్రాన్ చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణిస్తోందని హెచ్చరించింది. ఆదివారం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా బీరుట్​పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఇరాన్​ టెల్​అవీవ్​పై విరుచుకుపడింది.

ఇజ్రాయెల్ గగనతలం నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించిందని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో సైరన్‌లు మోగడంతో, లక్షలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఉత్తరాన అనేక పేలుళ్లు వినిపించగా, కనీసం మూడు దాడుల నుండి వచ్చిన క్షిపణులను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Iran Israel Missile Attacks | ఇరాన్​ తప్పు చేసింది

ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ.. “ఇరాన్ ఉగ్రవాద పాలన మరోసారి ఉగ్రవాదాన్ని ఎంచుకుని ఘోరమైన తప్పు చేసింది. దహ్యేపై ఐడీఎఫ్ దాడులకు ప్రతిస్పందనగా మా భూభాగంపై ప్రత్యక్ష కాల్పులు జరిపి కొత్త పరిణామాలకు దారి తీస్తోంది. ఉత్తర (ఇజ్రాయిల్) ప్రాంతాలపై హిజ్బుల్లా నిరంతరంగా కాల్పులు జరపడంతోనే మేం దహ్యేపై దాడి చేశాం. ఐడీఎఫ్ లెబనాన్ అంతటా తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరింత నష్టం కలిగిస్తుంది. ఇజ్రాయెల్ దేశ పౌరులపై నిరంతర కాల్పులను మేము అనుమతించం.” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Donald Trump NBC Interview | నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. నీకు ఇంటర్వ్యూ చేయడం కూడా రాదు: ట్రంప్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *