Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇటీవల భిక్కనూరు జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా కారు ప్రమాదానికి గురైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Ganesh Bigala | ఇటీవల భిక్కనూరు (Bhikkanoor) జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బిగాల తృటిలో తప్పించుకున్నారు.

Ganesh Bigala | ఆరోగ్య పరిస్థితిపై వాకబు..

ఈ సందర్భంగా ఆయనను హైదరాబాద్​లో మాజీమంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంపై సంతోషం వ్యక్తం చేస్తూ..ఎప్పటిలాగే ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్లాలని సూచించారు.

Ganesh Bigala | గణేష్ బిగాల క్షేమం కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోగ్యంగా ఉండాలని నగర బీఆర్​ఎస్ నాయకులు ఆకాంక్షిచారు. ఈ సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో, మాక్లూర్‌లోని విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం నీలకంఠేశ్వర ఆలయంలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు.

Ganesh Bigala

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కారు ప్రమాదం నుంచి గణేష్ బిగాల సురక్షితంగా బయటపడటం సంతోషకరమన్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతో ఆయన మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నుడా మాజీ ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, గాండ్ల లింగం, రమేష్, మాకు రావు, చింతకాయల రాజు, శివకుమార్, విఠల్, మధు, న్యాలం రమేష్, సన్నీ,మహేష్, నరేష్ గౌడ్, జింక, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gold Inspections | బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *