Gas Cylinder Prices | గ్యాస్ ధరల ఎఫెక్ట్.. సిలిండర్‌నే పొయ్యిగా మార్చిన వైనం

నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ల ధరల భారం సామాన్య ప్రజలను ఏ స్థాయికి నెడుతుందో చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gas Cylinder Prices | నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ల ధరల భారం సామాన్య ప్రజలను ఏ స్థాయికి నెడుతుందో చూపించే ఒక విచిత్రమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పెరిగిన ఇంధన ధరలను తట్టుకోలేక ఒక మధ్యతరగతి కుటుంబం తమ ఇంట్లోని పాత గ్యాస్ సిలిండర్‌నే ఏకంగా ఒక బొగ్గుల పొయ్యిగా మార్చేసింది. గ్యాస్ కొనే స్తోమత లేక, సిలిండర్ పైభాగాన్ని కట్ చేసి అందులో బొగ్గులు వేసి వంట చేసుకుంటున్న ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Gas Cylinder Prices | అవసరమే ఆవిష్కరణకు మూలం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “అవసరమే ఆవిష్కరణకు మూలం” అంటూ ఆయన ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

Gas Cylinder Prices |  ధరలు తగ్గించడంలో విఫలం..

ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్యుడిపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ఉజ్వల పథకం కింద సిలిండర్లు ఇచ్చిన ప్రభుత్వం, వాటి ధరలను మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లిందని విమర్శకులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి:  E85 Fuel | ఆ ఇంధనంతో.. లీటర్‌పై రూ. 20 ఆదా!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *