Steel Plant Accident | విశాఖ స్టీల్​ప్లాంట్​లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికుల మృతి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరుగుతున్న స్టీల్ పడటంతో 8 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Steel Plant Accident | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడల్‌ నుంచి హాట్‌ మెటల్‌ బకెట్లు కుప్పకూలాయి. మరుగుతున్న స్టీల్ పడటంతో 8 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.

ఫ్యాక్టరీలోని స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2లో ప్రమాదం జరిగింది. లిక్విడ్‌ స్టీల్‌ ద్వారా బీమ్స్‌ తయారు చేసే ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. లాడల్‌ బ్లాస్ట్ అవడం ఇదే ఫస్ట్‌టైమ్‌ అని కార్మికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో 150 టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ మెటల్‌ ఉన్నట్లు సమాచారం. అగ్ని మాపక సిబ్బంది, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. బ్లాస్ట్ కారణాలపై చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Steel Plant Accident | సీఎం దిగ్భ్రాంతి

స్టీల్​ ప్లాంట్​లో ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్‌పై దాడి.. అరెస్టు చేయాలని డిమాండ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.